CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 184

యేసు ప్రభువే సాతాను బలమును జయించెను

yesu prabhuve saataanu balamunu jayinchenu

Hebrews 2:14-15

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు ప్రభువే సాతాను బలమును జయించెను - అందరము (1)విజయగీతములు పాడెదము (2)
1. దావీదుకు చిగురు నీవై - యూదా గోత్రపు సింహము నీవై (2) దేవా నీవే గ్రంథము విప్ప (2)- జయమొందితివి నీకే స్తోత్రములు (2)
2. మన శ్రమలలో విజయము నిచ్చున్ - తన రాజ్యమునందు మనలను చేర్చున్ ఘన విజయమును మనకై పొందెన్ ఘన విజయము యేసేయని హర్షించెదము
3. మనలనెంతో ప్రేమించెను - తనయులముగ జయము పొందితిమి సర్వములో విజయమిచ్చిన - సర్వేశ్వరుండా నీకే జయము
4. మన మాయన సంఘముగా - తన రక్తము ద్వారా సమకూర్చెను సంఘమునకు శిరస్సాయనే - సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము
5. మహోన్నతుడు మహా ఘనుడు - మహిమరాజు మనకు విజయమునిచ్చె మరణము గెల్చి తిరిగి లేచె - ఆర్భాటముతో మనము హర్షించెదము

Back to Hebron Seeyonu Geethalu