పల్లవి:విజయుండు క్రీస్తు ప్రభావముతో - ఘనవిజయుండాయెను (2)సాతానుని తలను చితుక ద్రొక్కెను (2) - సదా రాజ్యమేలును (1)
1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? (2) సిలువ శక్తితో విరుగగొట్టెను (2) - విజయుండు సర్వంబులో (1)
2. యూదా గోత్రంపు సింహమాయనే - గ్రంథమును విప్ప యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పెడివాడు - యోగ్యుండు సర్వమందు
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు - మృతులలో నుండి ప్రథముడై లేచె మన ప్రభుయేసే మరణమును గెల్చె - సర్వములో ప్రధానుడై
4. సింహాసనమందు వున్న మన ప్రభువే - పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతివలె ప్రకాశించెను - జయమని పాడెదము
5. ఆయన యెదుట సాగిలపడి - నాలుగు జీవులు పెద్దలందరును సర్వసృష్టికి దేవుండవని - ఆరాధించి మ్రొక్కిరి
6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు - విజయమునిచ్చె తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభు,వే - అందరిలో అతిశ్రేష్టుండు