CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 191

ఓ అబ్రాహాం, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు

o abraahaam, issaaku ishraayelu devaa nitya nivaasi neevu

1 Kings 18:36

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)
1. ఏలోయి అదోనియా - త్రియేక దేవా ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2) ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2)
2. యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా - దర్శనమిచ్చు - దేవుడవు ఉన్నవాడవు - నిత్యుడవు
3. ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు
4. యెహోవా యీరే - చూచుకొనువాడవు యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు
5. యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము - శాంతి కర్తవు యెహోవా సిద్కెను - మా నీతియు నీవే
6. యెహోవా రోహి - లోక సంరక్షకుడా గొర్రెల నెన్నటికి - నెడబాయవు వాటిని విడువక - నడి పెద
7. యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు - యుగ యుగముల్ సదా మమ్ము నీతోనే - నుంచెదవు

Back to Hebron Seeyonu Geethalu