పల్లవి:నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు (1)నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు (1)నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు (1)
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి (2)
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
3. పాపపు లోకపులో - నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి