పల్లవి:అన్యజనులేల - లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల (1)
అను పల్లవి:జనములేల - వ్యర్థమైన - దాని తలంచుచున్నవి (2) || అ ||
1. భూలోక రాజులు - లేచి - వారేకముగా - ఆలోచించి - భూలోక రాజులు (1) వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు (2)
2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి - ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును
3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద - పరిశుద్ధమైన నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను
4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు - కట్టడ వివరింతు నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను
5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా - నన్ను అడుగుము దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు
6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు - ఇనుప దండముతో కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు
7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి - ఓ రాజులారా ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే