పల్లవి:యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (2)మహిమగల నీ నామము గొప్పది (2)
1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ (2)- బాలుర స్తుతి స్తోత్రములతో (2) స్థాపించితివి నీవొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము (2)
2. నీ చేతి పనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏపాటి వాడు
3. నీకంటె మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి
4. అడవి మృగములు ఆకాశపక్షులు - సముద్ర మత్స్యములు పశువులు వాని పాదముల క్రిందనుంచి - అధికారము వానికిచ్చితివి
5. నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ