CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 20

యెహోవా నీ కోపము చేత గద్దింపకుము

yehovaa nee kopamu cheta gaddimpakumu

Psalms 38:1-10 ;18-22

More
Reference recording on YouTube ↗
1. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ (2) నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము (1)
2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది
3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు
4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ నాపై మోయలేని బరువు - వలె నున్నవి
5. మూర్ఖతచే నా గాయములు - దుర్వాసనబట్టే - ఆ దుఃఖా క్రాంతుడనై - దినమెల్ల తిరుగుచున్నాను
6. నా నడుము తాపముచే నిండి - ఆరోగ్యములేదు - ఆ నేను సొమ్మసిల్లి బహుగా - నలిగియున్నాను
7. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు
8. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను
9. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ నా పాపమును గూర్చి విచారపడుచున్నాను
10. నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు
11. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ మేలు చేసినందుకు వారు - విరోధులైరి
12. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము

Back to Hebron Seeyonu Geethalu