పల్లవి:యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్నాశనమగు గుంటలో నుండియుజిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను (2)
1. నా పాదములను బండపై నిలిపి - నా యడుగులు దానిపై స్థిరపచి (2) క్రొత్త గీతమును నా నోట నుంచెను కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు (2)
2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక -ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు దయామయా మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు
3. వాటిని వివరింప లేనిల నీకు - సాటియైన వాడెవడైనను లేడు నైవేద్య బలులను కోరలేదు నాకు చెవులను నీవు నిర్మించినావు
4. పాపపరిహార బలులను దహన -బలులను నీవు తెమ్మన లేదు నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి యున్నట్లుగా నేను వచ్చియున్నాను
5. నీ చిత్తముచేయ నాకు సంతోషము - నా ఆంతర్యములో నీ శాసనములున్నవి ప్రజా సంఘములో నీ నీతి సువార్త ప్రకటించియున్నానని నేనంటిని
6. నీ నీతిని నా మదిలో దాల్చి - నీతి నిలయ నే నూరకుండ లేదు సంఘములో నీ రక్షణ కృపను సత్యమును నే దాచలేదు