1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా (2) స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు (2)
2. నేడు నీదు నామమందున - మేము - చేరి స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్య్రము
4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయె నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భ టించుచుందురు
6. నీవు తప్ప మాకు పరమందున - వేరెవరు గలరు? ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?