1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా (2) పాత్రుల జేసి నేటివరకు మమ్ము (2) - కాచిన దేవా (1)
2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి పాపులకై జీవమిడి గొల్లలకు నిజ - హర్ష మిచ్చితివే
3. హేమకిరీటము తెల్లంగి నే ధరింప హీనకిరీటము ముండ్లతో పొందితి - నన్ను రక్షింప
4. పాపినై చేసెడు పాపములను తీర్చను ఏపుగ కల్వరి యందున నాకై - పాట్లుపడితివి
5. పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల పాపమృతులమౌ మమ్ము రక్షింప - ప్రాణమిచ్చితివే
6. సైతానును జయింప శక్తినిచ్చిన దేవా బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ - జ్ఞానమీయుము
7. ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును జీవమార్గమున చక్కగ నడుతు - నాయన శక్తిచే
8. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి దానములిమ్ము దయతోడ నిత్యము - దయగల మా తండ్రి