పల్లవి:నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
1. కరుణతోడ - పిల్చియు (1)- స్థిరపరచి కాపాడిన (2) స్థిరపరచిన - నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును (2)
2. ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి
3. కృంగియుండు వేళలో - పైకి లేవ నెత్తితివి భంగపర్చు - సైతానున్- గెల్చి విజయమిచ్చితివి
4. నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి
5. సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై నిత్యుడౌ మా దేవుడా - ఆమే నంచుపాడెద