CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 210

స్తోత్రము పాడి పొగడెదను

stotramu paadi pogadedanu

1 Cor 13:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్రము పాడి పొగడెదను (1)దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను (2)
1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2) ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ (2)
2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ
4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహాదైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ
5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ సర్వశక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ

Back to Hebron Seeyonu Geethalu