CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 211

స్తుతియింతుము - స్తోత్రింతుము

stutiyintumu - stotrintumu

Ephesians 1:3-9

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతియింతుము - స్తోత్రింతుముపావనుడగు మా పరమ తండ్రిని - స్తుతియింతుము
1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా - మహిమగలిగిన నీ నామమును (1)
2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా
3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని ప్రియమగు కాపరులన్ - ప్రియమార మా కొసగిన తండ్రి
4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా
5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును పరిపూర్ణంబుగ కలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి
6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో ప్రతి యాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి
7. ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లు జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu