CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 222

యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే

yesu prabhu nee mukha darshanamuche

John 6:35

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే (2) - నా ప్రతి యాశను తీర్చుకొందును (2)
1. నీవే నాకు జీవాహారము (2) - నిన్ను సమీపించువారే మాత్రము (2) ఆకలి గొనరిల ఆదర్శుడవు (2)
2. నీ మందిర సమృద్ధి వలన - నా మది నెప్పుడు తృప్తి పొందితిని ఆనంద జలమును త్రాగించుచున్నావు
3. నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను ఘనపరచెదను
4. ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచితివి
5. నీ సంతోషము నాకొసగితివి - నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా
6. నాజీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు హల్లెలూయ పాటను పాడెద ప్రభువా

Back to Hebron Seeyonu Geethalu