పల్లవి:నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును -స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను (2)
1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ -వర్ణింప నెవరికి తరమౌనా? (2) పాపిని నన్ను రక్షించుటకై - చూపెను ప్రేమన పారముగా (2)
2. పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు - శాపగ్రాహియై చావొందెను
3. శోధన కాలముల యందున - వేదన కాలముల యందున నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు
4. ఎనలేని ప్రేమతో కౌగలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై
5. రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే పరమందుదూతలు యిహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా