పల్లవి:పాడెద దేవా - నీ కృపలన్ - నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్ - స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2) ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి - ఈ దీనుని బ్రోచితివి
2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో ఖలునకు నిచ్చితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి
3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్నుధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి
4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెర నను విడిపించితివి
5. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగ చేసితివి
6. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి