పల్లవి:జై జై యేసురాజా జై జై (1) -రాజాధిరాజా నీకే జై జై (2)
1. పాపకూపములో బడియున్న (2)- నన్ను జూచి చేయి జాచి (2) చక్కగ దరికి జేర్చితివి (2)
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన పావనుడగు నా ప్రభుయేసు
3. నీతి హీనుడ నైన నాకు - నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నొసగిన నీతి రాజా
4. మంటి పురుగు నైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన మహాప్రభుండా నీకే జై జై
5. పాప శాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ సంపాద్యముగా జేసితివి
6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ సొత్తయిన పరిశుద్ధ జనములో జేర్చితివి
7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన నమ్మకమైన నా ప్రభువా
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా యుగా యుగములకు నీకే జై జై