పల్లవి:నాదు ప్రాణమా - నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమా (1)ఆయన చేసిన దేనిన్ మరువకుమా (2)
1. వ్యర్థుడవై నాశనంబౌ - నిన్ను రక్షించి (2) మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే (2) ఓ నా మనసా యెంతటి ప్రేమ (2)- దేవుని క్రియ ల్మరువకుమా - నీ (1)
2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు ప్రియుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే సమర్పించు సర్వము తనకే - దేవుని క్రియల్మరువకుమా - నీ
3. రక్షణాలం - కార వస్త్రము జీవాహారము శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే ప్రేమపరిమళ స్తుతులను పాడి - దేవుని క్రియల్మరువకుమా - నీ
4. గెత్సేమనెలో కార్చెనేసు రక్తచెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ వినుమా మనసా యేడ్చెను నీకై - దేవుని క్రియల్మరువకుమా - నీ
5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల ప్రభునిరాక బూరధ్వనించు కాలమెప్పుడో ఆశతో ప్రభుని రాకను కోరి - దేవుని క్రియల్మరువకుమా - నీ