CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 238

స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ

stotrinchi keertinchedamu hallelooya

Habakkuk 3:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ -స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ (2)
అను పల్లవి:గడచిన కాలమెల్ల - కంటిపాపవలె (2)కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ (1)
1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన శాపమును మాపినాడు హల్లెలూయ (2) కన్నతల్లి వలెనే - కనికరించెను మమ్ము (2) యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ (1)
2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ ఎల్ల యీవులనిచ్చి - యుల్లాస మొసగును కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
3. శోధన కాలములందు హల్లెలూయ - మన - వేదన కాలములందు హల్లెలూయ నాథుడు యేసు మన చెంతనుండ నిల చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు - ఘోరముగ లేచినను హల్లెలూయ దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను - సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్

Back to Hebron Seeyonu Geethalu