పల్లవి:మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది (2) - మా దేవ (1)
1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే (2) మాయా మమతల గాధలనుండి -మమ్ములను రక్షించితివి (2)
2. కోడిపిల్లలను కాసెడు పగిది - ఆపదలన్నింటి బాపితివయ్యా సర్వకాలముల యందున నీకే -చక్కగ సంస్తుతులగు నీకే
3. సింహపు పిల్లలు ఆకలి గొనిన - సింహపు గుహలో నను వేసినను సిగ్గు కలుగకుండగ నను నీవు -గాపాడుచున్నా వీ యిలలో
4. మరణ లోయలందున నేనున్న -తరుణములు నాకు విరోధమైన చరణముల్ పాడెడు విధమున నీవు -నన్నొనర్చుచున్నావుగా
5. వ్యాధులు నన్ను బాధించినను-వ్యాకులములు హృదయములో నున్న వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు -నను బ్రోచుచు నుందువుగా
6. నీదు సత్యమాకాశము కంటె -అత్యున్నతముగ స్థాపించబడె నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి
7. పర్వతంబులు తొలగినగాని -పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెల లేనియట్టి కృప - నను విడువదు హల్లెలూయా