CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 246

రక్షణ్య పాటలుపాడి - రక్షకు డేసును సదా కొనియాడు

rakshanya paatalupaadi - rakshaku desunu sadaa koniyaadu

Psalms 32:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:రక్షణ్య పాటలు పాడి - రక్షకు డేసును సదా కొనియాడు (2)
అను పల్లవి:ఇక్కట్టులోన యేసును వెదకి (2) - ఎక్కాల మందును స్తుతించ కూడి (2)
1. అంధకారము నుండి విడిపించి - అమర్త్యుడేసుని రాజ్యము జేరి (2) అన్నియు నొసగు దేవుని జేరి (2) - పెన్నుగ ప్రభును మహిమపరచి (2)
2. అగ్ని నుండితీసి కొరవిని - విఘ్నము లేక బైట వేసి కపట వేషము పారద్రోలిన - ప్రాపకు డేసగు వేకువ చుక్కను
3. భయంకర పాపకూపము నుండి - బురదలో నుండి పైకిలాగి కాళ్ళను బండమీద నిలిపి - పాదములను స్థిరపరచిన యట్టి
4. మరణము నుండి తప్పించినట్టియు - తత్కాలమున తప్పించుచున్న ఇక ముందును తప్పించునను - గొప్ప నమ్మకమును మనకిచ్చిన
5. సంకటములనుండి విడిపించి - వణకును మన కెడబాటు చేసిన కష్టపెట్టిన బాధల తొలగించి - విడిపించినట్టి యేసును చూచి
6. శ్రమల నెల్లను పారద్రోలి - శోధనలు మనలను జేరకను సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన - ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును
7. దుష్టలోకము నుండి మనలను - లోకాధిపతి సైతాను నుండి పిసాచి యధికారములో నుండి - విడిపించిన ప్రభునకు హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu