పల్లవి:కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును (1)లేదే యిక నే యీవి యిల (1) - అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ (2) దూరముగనిక వెళ్ళ జాల - కూర్చుండెద నీ చెంతనే (2)
2. ఆకర్షంచె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును
3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము
4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును4 నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము
5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై