పల్లవి:నాకొరకై అన్నియు చేసెను యేసు - నాకింక భయము లేదు లోకములో (2)
అను పల్లవి:నాకొరకై అన్నియు చేసినందులకు (2)నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్ (2)
1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను - క్షామంతీర్చి ఏలీయాను ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) ఇంట నూనెకైన పిండికైన కొరతలేదు (2)
2. ఆకాశపక్షులను గమనించుడి - విత్తవు అవి పంటను కోయవు వాటిని పోషించునట్టి పరమపితా మమ్ము అనుదిన మద్భుతంబుగా నడుపున్
3. ఏమి ధరింతుమని చింతపడకు - అడవి పుష్పములను తేరిచూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
4. రేపటి దినము గూర్చి చింతపడకు - ఆప్తుడేసు నాకుండ భయమెందుకు రేపుదాని సంగతులనదే చింతించున్ ఏ నాటికీడు ఆనాటికే ఇలచాలును
5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో - పోషించెను ఐదువేలమందిని కూడ తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై