1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు - బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు - నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో
2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి - కన్యకుబుట్టి నేడు వేంచేసెన్ మానవజన్మ మెత్తిన శ్రీ యేసు - నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము
3. ఓ దూతలారా యుత్సహించి పాడి - రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండ నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో
4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ - మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్యమాయె నరరూపు - నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో