పల్లవి:ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున (1)మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను - (2)
1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా (2) దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా - (2) మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి (1) దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో- (2)
2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్ దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను
3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్ లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు