పల్లవి:నిరాకారా, సురూపుడా, మనోహరా (1)కరిగితివా నాకై వ్రేలాడుచు (2)- సిలువలో - నిరాకారా (1)
1. వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి (2) తీరని దాహము సహించితివి (2) - సిలువలో (1)
2. మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా శిష్యుల డెందములు పగుల - సిలువలో
3. అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో
4. కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి ఘోర గాయములు పొందితివి - సిలువలో
5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో
6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా! తీరుగా నే రక్షణ పొందను - సిలువలో
7. ఒక్కడగు నిత్య దేవునికే - ఒక్కడగు సుతుడేసునకే ఒక్కడగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా