పల్లవి:మనకై యేసు మరణించె మన పాపముల కొరకై (1)నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)
1. తృణీకరింపబడె - విసర్జింపబడెను (2) దుఃఖా క్రాంతుడాయె (2) - వ్యసనముల భరించెను (1)
2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్ మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి
3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె
4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్ అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును
5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్
6. ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట యెహోవా నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్
7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ