CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 273

యేసుని శ్రమలతోడ

yesuni shramalatoda

Luke 22:44

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను (2)- యేసుని శ్రమలతోడ (1)
అను పల్లవి:ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే (2)
1. నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా (2) వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నెరవేర్చెన్ (2)
2. దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్
3. శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు
4. సదయుని రక్తముచే - హృదయాలంకారముచే కలుగు నాహారమిదియే - ఎల్లరకు శ్రేష్టాహారం
5. తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనపై నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్
6. నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్ ఎల్లరికి నంగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్
7. హల్లెలూయా గీతమును - ఎల్లప్పుడు చాటుచుందున్ ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్

Back to Hebron Seeyonu Geethalu