పల్లవి:ఎటువంటి యాగంము జేసితివి - యేసు నీవలె నేనుండ నా కొరకై (2)
1. పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి (1) పశువుల తొట్టిలో పరుండియు (2) -పరమ ప్రేమన్ జూపెను ఆ ..ఆ ..ఆ .. (1) పశువుల తొట్టిలో పరుండియు (1)
2. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు మాకై సిలువ బాధ నొందితివి - మమ్మును విమోచించన్ మాకై సిలువ బాధ నొందితివి
3. తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండె నీకు నీయడుగు జాడలలో నేనుండన్ - నాముందు వెళ్ళితివి నీయడుగు జాడలలో నేనుండన్
4. తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి నీ సిలువ మోయువారెల్లరును - నీ మహిమ జూచెదరు నీ సిలువ మోయువారెల్లరును
5. నీ శ్రమలు బాధలేగా నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను నీకై నా జీవమెల్ల నియ్యను - నీ శ్రమలే నే కోరెదన్ నీకై నా జీవమెల్ల నియ్యను
6. నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు నీ వెంట వెళ్ళను నే వెరువను - నీ ప్రేమ నాలో నుండ నీ వెంట వెళ్ళను నే వెరువను