పల్లవి:చూడుమదే నీ కొరకే - సిలువపై వ్రేలాడుశ్రీయేసు రక్షకున్ - చూడుమదే (1)
1. నలుగ గొట్టబడె నీకై - పలుకకుండె మారుగా (2) శిరస్సున రక్తధారలు విరచె రెక్కలను గ్రుచ్చ (2) నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె (1)
2. రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై
3. గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే
4. ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చును రక్షణను