1. మహాత్ముడైన నా ప్రభు - విచిత్ర సిల్వజూడ నా ఆస్తిన్ నష్టంబుగా నెంచి - గర్వంబణంగ ద్రొక్కుదున్
2. నీ సిల్వగాక యోదేవా - దేనిన్ బ్రేమింపనీయకు నన్నావరించు సర్వమున్ - నీ సిల్వకై త్యజింతును
3. శిరంబు పాదహస్తముల్ - సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా - విషాద ప్రేమలీగతిన్
4. ముండ్లన్ దుర్మార్గులల్లిన - కిరీట మేసు కుండినన్ ఈ భూకిరీటములన్ని - దానిన్ దూరంగ జాలునే
5. లోకంబు నే నర్పించినన్ - అయోగ్యమైన యీవియౌ వింతైన యేసు ప్రేమకై - నా యావజ్జీవమిత్తును
6. రక్షింపబడ్డ లోకమా - రక్షింప చావు పొందిన రక్షకుడేసును సదా - రావంబు తోడ గొల్వుమా