CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 288

దేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువా

devaa naadevaa nannela vidachitivani siluvalo baliyaina naa yesuvaa

Psalm 22:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నాదేవా నన్నేల విడచితివని -సిలువలో బలియైన నా యేసువా (1)పలుబాధ లొందితివి నా శైలమా (2)
1. నా తండ్రి నీకిది సాధ్యమైతే - ఈ గిన్నె నానుండి తొలగింపుమని (2) నా నాథా తండ్రిని వేడితివా (2) నే మోయలేని ఈ భారమంత (2) నీవు గాక యెవరు భరింతురు (2)
2. నీ శిష్యులంతా యేమైపోయిరి - నీవు స్వస్థపరచిన రోగులేరి నీ తండ్రికూడా నిను విడనాడెనా నా దోషమంతా నీపై మోపెనా నిను నలుగగొట్టుట కప్పగించెనా
3. నిన్ను రచ్చకీడ్చను నా రక్షకా - నీ నేరమేమిటి ఓ నా ప్రభువా మానవులు దేవుని చంపుటయా? ఏ చరితంబులోనూ కలదా ప్రభూ? ఈ ఘోరమరణము నాకై నొందితివా?
4. సొగసైన షారోను ఓ పుష్పమా - సురూపమంతా కోల్పోయితివా వ్యసనా క్రాంతుడవైతివా నాకై వ్యాధిని అనుభవించితివి నాకై వధియింప బడితివి బలి పశువుగా

Back to Hebron Seeyonu Geethalu