CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 297

రాజాధిరాజా రావే

raajaadhiraajaa raave

Revelation 22:20

More
Reference recording on YouTube ↗
పల్లవి:రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే -రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే (2)ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే (1)ఓ ... మించు వైభవంబుతోడ వేగమే (1)
1. ఓ ... భూజనంబులెల్ల తేరి చూడగా - ఓ ... నీ జనంబు స్వాగతంబు నీయగా (2) నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ (1) భూమియాకాశంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ (1)
2. ఆ ... ఆకసమున దూతలార్భటింపగా - ఆ ... ఆది భక్త సంఘ సమేతంబుగా (2) ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభచేయ (1) యేసునాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ (1)
3. ఓ ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా ! ఓ ... గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా ! పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా ! పెద్దలారా ! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా

Back to Hebron Seeyonu Geethalu