CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 299

ప్రభుని రాకడ ఈ దినమే

prabhuni raakada ee diname

Amos 4:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే (2)
అను పల్లవి:పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును -పాలనకై (2)- బూరశబ్దముతో - జనులారా (1)
1. సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకై (2) బుద్ధిహీనులను - శ్రమచేత - బద్ధులుగ జేయున్ - వేదనతో (2) బాధ కలిగించున్ - సాతాను (1)
2. స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్ - తనదూత సూర్యచంద్రునిలన్ - తారలతో జీకటుల్ క్రమ్మున్ - ప్రభురాక పగలు రాత్రియగున్ - త్వరపడుము
3. మొదట లేతురు సజీవులై - ప్రభుని యందుండు - ఆ మృతులు మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండి ధన్యులగుదుము - పరికించు
4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమున -ప్రియులు సాయం సమయమున చేరి - నెమలి కోకిలలు -రాజున్ పాడి స్తుతించును - ఆ దినము
5. గొఱ్ఱె మేకలును - ఆ చిఱుత సింహజాతులును - ఒక చోట భేధము లేక బరుండి - గరిక మేయును - ఆవేళ కలసి మెలగును - భయపడక
6. న్యాయ నీతులన్ మన - ప్రభువు ఖాయముగ దెల్పున్ - ఆనాడు సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు - ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా

Back to Hebron Seeyonu Geethalu