పల్లవి:జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చును (2)వందనం, హోసన్న, 2రాజాధిరాజు వచ్చును (2)వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము (2)
1. చాలా రాత్రి గడిచిపోయె (2) - చూడు పగలు వచ్చెనుగా (2) విడువుము అంధకార క్రియలు (2) - తేజో ఆయుధముల ధరించుము (2)
2. గుర్తులన్ని నెరవేరినవి - నోవహు కాలము తలచుము లోతుభార్యను మరచిపోకు - మేలుకొనెడి సమయమువచ్చె
3. మన దినములు లెక్కింపబడెను - మేల్కొనువారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు - యెవరు ప్రభువుతో నడచెదరో
4. దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు మేఘమునందు ఎల్లరు చేరి - అచ్చటనే ప్రభుని గాంతురు
5. క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును - విజయులే దాని పొందెదరు ప్రీతిగ పల్కును ప్రభువే - మనతో నావన్నియు మీవేయనుచు