పల్లవి:ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే (1)విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై (2)
1. ప్రభువు దిగివచ్చు నార్భటముతో (2)- దూత శబ్దముతో బూరధ్వనితో (2) క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు (2) వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా? (2)
2. వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చును తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా సిగ్గుతో భయముతో నుందువా దినమునా?
3. హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడి శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి
4. అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను తనకొరకై వేచియుండు వారికొరకు పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ
5. ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో నిద్దుర పోవుచునుండగా వచ్చునో మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు