పల్లవి:క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి (2)
అను పల్లవి:సూచనలు చూపుచున్నవి (1)- వేచియుండుడి ఆయనకై (2)
1. రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును (2) అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు (2)
2. పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే
3. మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును
4. వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్