పల్లవి:రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు (2)ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)
1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో -సిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్ (2) ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా (2)
2. బుద్ధిలేని కన్యకవలె మోసపోతివా - చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో నూనెలేక భ్రమతో బ్రతికెదవా లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా
3. వాక్యముకై జీవితం అప్పగింపక - దాచితివా తలాంతులను లెక్కచేయక మొదటి ప్రేమను తిరిగి పొందుమా లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా
4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో - కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా