పల్లవి:ఈయన మాట వినుడి నేడు (2)- ఈయనే నా ప్రియ కుమారుడు (2)
1. ఈయనే నా ప్రియ కుమారుడు (2)- శాపముతీర్చెడు పాపరహితుడు (2) దైవకుమారుండీయనే (1)
2. ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను దహించబడుదు రెల్లప్పుడు
3. మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప మహాసైన్యము లేచెను
4. పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము విధేయులై వికసింతుము
5. దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై రిక్తుడుగ మరణించెను
6. పరమందునుండు వారిలోగాని - భూమి యందును భూమిక్రిందైన పూజనీయుడీయనే
7. సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము నిత్యము కల్గును గాక