1. పాపమునకు జీతము మరణము (3) - ఓ పాపి భయపడవా? - చూచునదెల్ల నశించు నిశ్చయము (3) - చూడనిదే నిత్యము
పల్లవి:యేసురాజు వచ్చును - ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము (2)
2. లోకసుఖము నమ్మకు నమ్మకు - ఆ యిచ్ఛలు మాయమగు - నీ జీవముపోవు సమయమున - చిల్లిగవ్వ వెంటరాదు || యేసు ||
3. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది - లోకమాయలయందున - దైవకోపము వచ్చుటకు ముందు - నీ రక్షకుని చేరుము || యేసు ||
4. దైవ ప్రేమ పారుచున్నది - కల్వరిగిరి మీదనుండి - నీ పాపమెల్ల అందుపోవును -స్నానంబుచేసినన్ || యేసు ||
5. మహా పాపినైన నన్నును -నా మిత్రుడంగీకరించెన్ ఓ పాపి నీవు పరుగిడి రా - దేవ దీవెనల పొందుము || యేసు ||
6. కష్టదుఃఖము లెక్కువగుచో - ఇష్టుడేసుని వీడను - సిగ్గులేక చేరుదు నాయనచెంత - నెప్పుడు వసింతును || యేసు ||