పల్లవి:పరిపూర్ణంబగు గురువు యెవరు? -ప్రేమతో నిండిన హృదయుండె (2)
1. పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు (2) నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే (2)
2. ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు కపటము డాగులేని సుబుద్ధి - కరుణామయ హృదయుడు
3. కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్
4. సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను