CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 363

మహావైద్యుండు వచ్చెను బ్రజాళి బ్రోచు యేసు

mahaavaidyundu vachenu brajaali brochu yesu

Exodus 15:26

More
Reference recording on YouTube ↗
1. మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు (1) సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్ (1)
పల్లవి:మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము (1)వేదవాక్య సారము - యేసు దివ్యయేసు (1)
2. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు ||మాధు||
3. వినుండి గొఱ్ఱెపిల్లను - విశ్వాసముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్ ||మాధు||
4. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్ శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్ ||మాధు||
5. ఓ యన్నలారా - పాడుడీ - యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు ||మాధు||
6. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్ దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు ||మాధు||
7. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును ప్రియంపు దాసులౌచును - రయంబు కొల్వుడేసున్ ||మాధు||

Back to Hebron Seeyonu Geethalu