1. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును
పల్లవి:హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోమున్గి మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్ || హల్లె ||
3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు విలువైన మన్నింపునొంది - పాడుదును సదా || హల్లె ||
4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్ || హల్లె ||
5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్ రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్ || హల్లె ||