పల్లవి:ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే (2)నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ (2)
1. మన ప్రభువే రక్షణ శృంగమాయె (2)- శత్రువు నోడించ శక్తి మంతుడు (2) మనకు జయము నిచ్చును (2)
2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనల పాదముల స్థిరపరచెను
3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత ప్రియమార దయచేయును
4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి పదిలముగా రక్షించును
5. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ ఆశతోడ నుందుము
6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ ఊటచే సంతృప్తి కలిగె పరిపూర్ణత నీవేగా
7. రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసి ఆనందింప జేసెను