పల్లవి:యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు (2)
1. లోకము నాలుగు దినముల నటనే - నికరము గాదెవరికిని (2) దారిని తప్పి తిరిగెదవేల (2) ఎరిగితివా నీ గురిని - కడకీలోకము వదలెదవు (2)
2. కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయె నీ రూపం - కడకీలోకము వదలెదవు
3. ప్రభుయేసు సిలువలో వ్రేలాడె - పాపిని రక్షించుటకు పాట్లుపడె తనరక్తము కార్చె పాపపు ముల్లును విరచె - కడకీలోకము వదలెదవు
4. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను - ప్రియుడా త్వరపడి రమ్ము ఆయన యందు నమ్మికయుంచిన ఆయనే నీ శరణగును - కడకీలోకము వదలెదవు