CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 371

మారు మనస్సు పొందుము

maaru manassu pondumu

Matthew 4:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:మారు మనస్సు పొందుము (2)- ప్రభుని రాజ్యము సమీపించెను (2)
1. యెహోవా దేవుని రాజ్యము - మహోన్నతమై వ్యాపించెను (2) తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు (2) తన శౌర్యమునెంతో చాటెదరు (2)
2. ఆయన రాజ్యము శాశ్వతము - ఆత్మలో దీనులగువారు ఆ రాజ్య నివాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు
3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు
4. రక్తమాంసంబులు దానిని - స్వతంత్రించు కొనజాలవు స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు
5. అంధకార రాజ్యమునుండి - పొందుగా తన రాజ్యంబునకు ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము

Back to Hebron Seeyonu Geethalu