CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 374

ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా

evaro telusaa yesayyaa chebutaa nedu vinavayyaa

Luke 19:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా (1)పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా (2)
1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా (2) మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే (2)
2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే
3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో
4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరమున - నమ్మని వారికి నరకమేగా
5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్

Back to Hebron Seeyonu Geethalu