CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 375

శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో

shramalanu ponde shree yesudu nee korakai siluvalo

Romans 5:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
1. సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె వహించె నీ శాపం భరించె నీ పాపం నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు
2. దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన
3. ఎవరేసు రక్తములో - కడుగబడెదరో వారే చేరెదరు - తన సంఘమునందు అంగీకరించుము - యేసును నీవు కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు
4. సిలువపై యేసు - సర్వ మర్పించె నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె యేసునకు నీవు - ఏమియ్యగలవు? తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను

Back to Hebron Seeyonu Geethalu