CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 380

యేసు ప్రభువే లోకరక్షకుడు

yesu prabhuve lokarakshakudu

John 4:42

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు ప్రభువే లోకరక్షకుడువేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)
1. లోక సృష్టికర్త పాపము బాప - నరునిగ భువికి - అరుదెంచె ఆ.. (2) పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)- ప్రేమతో నిన్ను విడిపింప (1) వేరెవ్వరు లేరు - జీవాధిపతి - యేసుడే (2)
2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్ - చక్కగ నడువ జేసెను మూగ వారిని మాట్లాడగ జేసెను - చెవిటి వారి చెవుల వినజేసెన్ వేరెవ్వరు కాదు - సర్వాధికారి - యేసుడే
3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి -ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్ -కష్టము లేకుండా జేసెన్ వేరెవ్వరు కాదు - జీవాధిపతి - యేసుడే (2)
4. నేనే మార్గం, సత్యం, జీవం అనెను - వేరొక మార్గం లేదనెన్ ఆ సాతాను తలను చితుక ద్రొక్కెను - మరణించి తిరిగి లేచెన్ నిను పరమున - చేర్చ ప్రభు యేసే నీకు మార్గము వేరెవ్వరు లేరు - ప్రభు యేసే నీకు మార్గము

Back to Hebron Seeyonu Geethalu