CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 381

యేసుని చెంతకు ఆశతో రమ్మిల

yesuni chentaku aashato rammila

2 Cor 6:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా (2)
అను పల్లవి:ఇదియే మిక్కిలి అనుకూల సమయము - ఇదే రక్షణ దినముఇప్పుడే యేసుని యెదలో నమ్మిన - ఇదే రక్షణ దినము (2)
1. పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా (2) మృతుడై లేచెను పరమున కేగెను ధర కేతెంచునయా (2) స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2)
2. జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయా దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా
3. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా

Back to Hebron Seeyonu Geethalu